31-10-2025 11:24:59 AM
 
							అమరావతి: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హత్య కేసులో ఐదుగురికి చిత్తూరు మరో అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన వారిలో మేయర్ భర్త మేనల్లుడు చింటూ ఉన్నాడు. 2015 నవంబర్ 17న కఠారి అనురాధ, భర్త మోహన్ హత్య జరిగింది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే అనురాధ, మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో చింటూ, వెంకట చలపతి, జయప్రశాశ్ రెడ్డి, వెంకటేష్, మంజునాథ్ కు కోర్టు ఉరిశిక్ష వేసింది. ఇదే కేసులో మరో 16 మందిపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.