calender_icon.png 29 September, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకధాటిగా వర్షాలు... దెబ్బతింటున్న పత్తి పంట

29-09-2025 12:47:30 AM

మాగనూరు. సెప్టెంబర్, 28 మాగనూరు మండలంలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పత్తి పంట దెబ్బతింటుందని మండల రైతులు తమ వేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టు మాసంలో కురిసిన వర్షానికి పైరు ఎదుగుదల లేక పోవడం జరిగినదని. పత్తి పంట కాయ పిందే పత్తి పగులుతున్న సమయంలో వర్షాలు కురవడం వల్ల పత్తి పంట కు రోగాలు రావడం జరిగింది అన్నారు.

రోగాలు రావడం వల్ల పత్తి దిగుబడి తక్కువగా వస్తుందని రైతులంటున్నారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలని. కానీ ఇప్పుడు ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల పత్తి వస్తుందో లేదోనని రైతుల తమ ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి పంట పెట్టుబడి ఎకరానికి 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. పెట్టుబడి కోసం తెచ్చుకున్న అప్పులు ఏ విధంగా తీర్చాలని రైతులు ఆవేదన దిగులుతో ఉన్నారు. వర్షానికి నష్టపోయిన పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మండల పత్తి రైతులుకోరుతున్నారు.