29-09-2025 12:46:44 AM
* ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము, టైలర్స్ కాలనీ, వందనాపురి కాలనీ, సృజన లక్ష్మీ నగర్ కాలనీ, మల్లికార్జున హిల్స్ కాలనీలలో రూ.3.23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యుజిడి నిర్మాణ పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.