03-05-2025 02:11:41 AM
భారీ వృక్షం కూలి నలుగురి మృతి
న్యూఢిల్లీ, మే 2: దేశ రాజధాని ఢిల్లీని అకాల వర్షం ముంచెత్తింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ప్రాంతంలో ఈదురుగా లులతో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. భారీ వర్షానికి లజ్‌ప త్‌నగర్, ఆర్కే పురం, ద్వారక ప్రాంతాల్లో నీరు నిలవడంతో ఢిల్లీ పారిశుద్ధ్య యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
దాదాపు వంద విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 40 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు పేర్కొన్నారు. ద్వారకలో భారీ వర్షానికి ఒక ఇంటిపై వృక్షం కూలడంతో మహిళ సహా ఆమె ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోనూ భారీ వర్షానికి ఝజ్జర్ ప్రాంతంలోని రహదారులు నదులను తలపించాయి.