03-05-2025 02:06:39 AM
నిజామాబాద్ మార్చ్ 2: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ చెందిన బండి సురేష్ తోపాటు ఇతరుల పైన అతని భార్య 498 ఏ సెక్ష న్ తో పాటు మానసిక శరీరక వేధింపులు అదనపు కట్నం ఆరోపణపై కేసు నమోదు అయింది. రెండు లక్షలు అదనంగా కట్నం డబ్బులు తేవా లని వేధిస్తున్నారనే ఆరోపణపై కోర్టులో కేసు దాఖలు చేశారు. గురువారం పై కేసు విషయమై కోర్టుకు హాజరు కావలసి ఉండం తో కోర్టు కు చేరుకున్నారు.
నేరారోపణ ఎదురుకుంటున్న 60 ఏళ్ల వృద్ధ మహిళ అనసూయ నడవడం సరిగ్గా చేతకాక పోవడంతో మెట్లు ఎక్కడం కష్టతరంగా మారడంతో వారి తరఫున న్యాయవాది ఎర్రం విగ్నేష్ ముద్దాయి ఆరోగ్య సమస్యను తెలుసుకున్న సంబంధిత న్యాయమూర్తి నిజామాబాద్ రెండవ అదనపు జ్యుడీషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పాముజల శ్రీనివాసరావు జిల్లా కోర్టు మొదటి అంతస్తు లోగల కోర్టు హాలు నుండి దిగివచ్చి కింద ఆవరణలో ఆటో లో ఉన్న ముద్దాయి అనసూయ వద్దకు వెళ్లి కేసు పూర్వపరాలు బాధితురాలికి తెలియపరచి నేరా అభియోగాలు నమోదు చేశారు.