ఎన్యూమరేషన్ ఫారాల భర్తీకి హెల్ప్‌డెస్క్
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ముషీరాబాద్ నియోజకవర్గం ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హ తెలిపారు. మంగళవారం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. సోమన్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ దరఖాస్తులను బర్తీ చేసి బీఎల్ వోకు అందజేశారు.
ఈ సందర్భంగా ముఠా జైసింహ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాల బర్తీలో కొంత మంది ఓటర్లు దరఖాస్తును నింపడంలో ఇబ్బంది పడుతుండడంతో వారికోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాలతో పార్టీ నాయకులు గత నెల 24వ తేదీ నుంచి బీఎల్వో లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. కొన్ని పోలింగ్ బూత్లలో ఇప్పటికే 100 శాతం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ నేతలు 60లక్షల మంది క్రమశిక్షణతో తమ ఎన్యూమరేషన్ దరఖాస్తులను బీఎల్ వోలకు అందజేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఎస్‌ఐఆర్ ను విజయవంతానికి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామ న్నారు. ఎన్యూమరేషన్ ఫారాల బర్తీలో నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని ప్రతిఒక్కరూ బాధ్యతా యుతంగా ఎస్‌ఐఆర్ కు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, పార్టీ సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, వాణిజ్య విభాగం డివిజన్ అధ్యక్షుడు టెంట్స్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బల్ల ప్రశాంత్, మోహిన్, డివిజన్ మాజీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు సదా, సంతోష్, పార్టీ సీనియర్ నాయకులు జాఫర్ పాల్గొన్నారు.






