1 August, 2026 | 11:44 PM

వరద బాధితులకు సహాయం

03-09-2025 12:14 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి) ః వరద బాధితులకు పరిహారం అందించడంతో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. వరదలకు గురైన కామారెడ్డి పట్టణంలోని బాధితులకు మంగళవారం నిత్యవసర సరుకులను అందించారు. రాజంపేట మండలంతో పాటు  వరద ప్రభావానికి గురైన రాజంపేట బాధితులకు నిత్యవసర సరుకులు అందించాలని ఆర్డీవోను ఆదేశించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో వర్షం కురిసిన అధిక వర్షాల వలన  సంభవించిన వరద ప్రభావానికి గురైన కుటుంబా లను ఆదుకోవడంలో భాగంగా ఇప్పటికే తాత్కాలిక నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దుప్పట్లు, చెద్దర్లు, చీరలు, బియ్యం,,పప్పులు తదితర నిత్యవసర సరకులను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి ఆర్డిఓ వీణ, తాసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.