2 August, 2026 | 12:46 AM

మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

03-09-2025 12:12 AM

-సీజనల్ వ్యాధులు పైన అప్రమత్తంగా ఉండాలి

- వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా

జనగామ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుం దని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామో దర్ రాజనర్సింహా అన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి  రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో CT స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు.

ఈ సంద ర్బంగా మంత్రివర్యులు ఆసుపత్రి లో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, జనగామ జిల్లా వైద్య అరోగ్య శాఖ అధికారులతో ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమీక్షలో మెడికల్ కాలేజీ , నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులతో పాటు నిర్వహణ లపై  చర్చించారు. PHC ల , ChC , CMS ల పనితీరుపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్‌ల  నిర్మాణ పనులపై, సీజనల్ వ్యాధుల కట్టడి పై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కృషి చేయాలనీ మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం చేయకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామో దర్ రాజనర్సింహా హెచ్చరించారు. ఈ సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,  DMHO మల్లికార్జున్, ggh సూపరిం టెండెంట్ రాజలింగం , మెడికల్ కాలేజీ ప్రినిపాల్ నాగరాణి , వైద్య శాఖ అధికా రులు పాల్గొన్నారు .