ప్రజాపాలనలోనే పల్లెల అభివృద్ధి
చిన్న చింతకుంట: ప్రజా పాలనలో పల్లెలు అభివృద్ధి చెందేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం తన సొంత గ్రామమైన ధమగ్నాపూర్ లో రూ 84 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రజాపాలనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు.గ్రామాలలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగంగానే గ్రామంలో డ్రైనేజీలు, సిసి రోడ్లు, బస్టాండ్, అంగన్వాడి కేంద్రాల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.






