calender_icon.png 28 January, 2026 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవిగో స్కాం ఆధారాలు..

28-01-2026 01:23:19 AM

ఎస్‌సీసీఎల్‌లో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు 

ప్రజాధనం దుర్వినియోగం, తగ్గిన పోటీ, లోపించిన పారదర్శకత  

‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనపై అనుమానం

సోలార్ పవర్ ప్రాజెక్టులతో 250 కోట్ల అదనపు భారం

1,044 కోట్ల టెండర్‌లో టెక్నికల్ బిడ్స్ ఏడు సార్లు వాయిదా

ఎస్‌సీసీఎల్‌లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి

సింగరేణి కుంభకోణం బాధ్యులపై చర్యలు తీసుకోండి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మెమోరాండం అందజేసిన బీఆర్‌ఎస్ ఎల్పీ

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటె డ్(ఎస్‌సీసీఎల్)లో టెండర్లు, కొనుగోళ్లు, విధాన నిర్ణయాలు, సీఎస్‌ఆర్ కార్యకలాపాల్లో జరుగుతున్న అవకతవకలకు సంబం ధించిన ఆధారాలన్నీ ఉన్నాయని, ఈ కుంభకోణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్‌ఎస్ సభాపక్షం కోరింది. మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణానికి సంబంధించిన వివరాలతో మెమోరాండం సమర్పించింది. తెలంగాణ రాష్ట్రానికి అ త్యంత కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థ..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో జరుగుతున్న తీవ్ర స్థాయి పరిపాలనా, ఆర్థిక, విజిలెన్స్ సంబంధిత లోపాలను ఆయన దృష్టికి తీసుకొచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎస్‌సీసీఎల్‌లో టెండర్లు, కొనుగోళ్లు, విధాన నిర్ణయాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో ప్రభుత్వ రంగ సంస్థల నియమాలకు విరుద్ధంగా వ్యవహారం జరుగుతోందన్న ఆరోప ణలు ఉన్నాయని, దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం, పోటీ తగ్గిపోవడం, పారదర్శకత కోల్పోవడం, పర్యవేక్షణ బలహీనప డుతున్నదని ఆరోపించింది. 

టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ పరిమితి 

మే 2025 నుంచి ఎస్‌సీసీఎల్ కొన్ని ఓపెన్‌కాస్ట్ టెండర్లలో అధికారులిచ్చే ‘సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్’ తప్పనిసరి చేసిందని, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని వివరించింది. ఇలాంటి నిబంధన ఎస్‌సీసీఎల్‌లో గతంలో ఎప్పుడూ చూ డలేదు,- భారీ విలువైన టెండర్లలో కూడా కాదు, 2018లో సీఎంపీడీఐలో ఈ అంశం పై చర్చ జరిగినా, ఎప్పుడూ అమలు కాలేదు.

ఇప్పుడు అకస్మాత్తుగా పెట్టడం అ నుమానాస్పదం, కోల్ ఇండియా వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి నిబంధన లేదు, కొద్దిమంది కాంట్రాక్టర్లకే సర్టిఫికెట్లు ఇచ్చి, మిగతావారిని కావాలనే తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని ఆరోపించింది. కొంతమందిని టెండర్ చివ రి నిమిషం వరకు వేచి ఉంచి, రెండు మూ డు సంస్థలకే సర్టిఫికెట్లు ఇవ్వడం, కొన్ని సర్టిఫికెట్లు వెనుక తేదీలతో ఇచ్చినట్లు ఆరోప ణలు ఉన్నాయని, ఇది సమాన పోటీ సూ త్రానికి పూర్తిగా విరుద్ధమని తెలిపింది. 

తక్కువ రేటు టెండర్లు రద్దు చేసి, ఎక్కువ రేటుకు..

ముందుగా తక్కువ రేటుకు ఇచ్చిన కొన్ని టెండర్లను స్పష్టమైన కారణం లేకుండా రద్దు చేసి, మళ్లీ కొత్త షరతులతో ఎక్కువ రేటుకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీని వల్ల ఎస్‌సీసీఎల్‌కు భారీ నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది.

సోలార్ పవర్ ప్రాజెక్టుల కొనుగోళ్లు 

ఎస్‌సీసీఎల్ మొత్తం 107 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టిందని, అ యితే అనేక ప్రాంతాలను కలిపి ఒకే టెండర్ పెట్టడంతో చిన్న, మధ్య తరహా సంస్థలకు అవకాశం లేకుండా పోయిందని వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న సగటు ధరల కంటే చాలా ఎక్కువ రేట్లకు ఒప్పందాలు ఇచ్చారని, దీని వల్ల సుమారు రూ. 200 కోట్ల అదనపు భారం పడినట్లు అంచ నా ఉందని తెలిపింది. అదే విధంగా రామగుండం 67 మెగావాట్ల ప్రాజెక్ట్ కూడా జాతీ య సగటు ధర కంటే దాదాపు రెట్టింపు రేటుకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. 

భారీ ఓపెన్‌కాస్ట్ టెండర్లలో జాప్యం

మణుగూరు ప్రకాశం ఖని సంబంధించి సుమారు రూ.1,044 కోట్ల టెండర్‌లో టెక్నికల్ బిడ్స్‌ను ఏడు సార్లు వాయిదా వేశారని, మరో రూ. 600 కోట్ల ఓబీ టెండర్ కూడా పలు మార్లు కారణం చెప్పకుండా వాయి దా పడిందని చెప్పింది. ఇలాంటి చర్యలు టెండర్ ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేసింది. 

డీజిల్ కొనుగోలు విధానంలో మార్పు 

మునుపటి వరకు ఆయిల్ పీఎస్‌యూల నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసేవారని, ఇప్పుడు కాంట్రాక్టర్లకు బాధ్యత అప్ప గించారని తెలిపింది. దీని వల్ల ఖర్చు పెరిగింది, అర్హత ప్రమాణాలు పెరిగాయి, అను భవం ఉన్న కాంట్రాక్టర్లు బయటకు వెళ్లిపోయారు, అనుభవం లేని సంస్థలు వచ్చి పనులు సరిగా చేయలేక ఒప్పందాలు రద్దయ్యాయని వివరించింది. 

సీఎస్‌ఆర్ నిధుల వినియోగంలో అవకతవకలు 

ఎస్‌సీసీఎల్ సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో ప్రాజెక్టుల ఎంపికలో పారదర్శకత లేదు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఖర్చు, ఫలితాలు కనిపించని కార్యక్రమాలు, కొద్దిమంది సంస్థలకే నిధుల కేంద్రీకరణ వంటి అవకతవకలు జరిగాయని ఆరోపించింది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే లియోనెల్ మెస్సీ పాల్గొన్న ఫుట్‌బా ల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు సంబంధించిన స్పాన్సర్‌షిప్‌కు సీఎస్‌ఆర్ నిధులు వినియోగించినట్లు సమాచారం ఉందని, ఇది స్థానిక ప్రజల అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేని ఖర్చు అని స్పష్టం చేసింది. 

నాయకత్వం, పర్యవేక్షణ లోపం... 

దీర్ఘకాలంగా ఎస్‌సీసీఎల్‌కు నియమిత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం వల్ల పర్యవేక్షణ, బాధ్యత, నియంత్రణలు బలహీనపడ్డాయని తెలిపింది.  ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌సీసీఎల్‌లో జరిగిన అవకతవకలపై తగిన స్థాయిలో విచారణ జరిపించాలని కోరింది. ‘పారదర్శకమైన, పోటీతో కూడిన టెండర్ విధానాలను పునరుద్ధ రించాలి, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనతో ఇచ్చిన అన్ని టెండర్లను సమగ్రంగా సమీక్షించాలి, భారీ టెండర్లలో జరిగిన అనవసర వాయిదాలపై పరిశీలన చేయాలి, ఎస్‌సీసీఎల్ లో బలమైన నాయకత్వం, పర్యవే క్షణ ఏర్పాటు చేయాలి, ప్రజాధనం మరింత నష్టం కా కుండా చర్యలు తీసుకోవాలి’ గవర్నర్‌కు బీఆర్‌ఎస్ సభా పక్షం విజ్ఞప్తి చేసింది.

నిబంధనకు ముందు-- తర్వాత టెండర్ల ఫలితాలు 

జనవరి 2025లో భూపాలపల్లి ఓపెన్‌కాస్ట్ టెండర్‌లో ఈ నిబంధన లేకపోవడంతో మంచి పోటీ నెలకొని టెండర్ అంచ నా ధర కంటే 7 శాతం తక్కువ రేటుకు దక్కిందని, కానీ మే 2025లో వీకే ఓపెన్‌కాస్ట్ టెండర్‌లో ఈ సర్టిఫికెట్ నిబంధన పెట్టడంతో పోటీ తగ్గిపోయిందని పేర్కొంది. అంచనా ధర కంటే ఎక్కువ రేటుకు టెండర్ ఇచ్చారని, ఇది ఈ నిబంధన వల్లే నష్టం జరుగుతోందని స్పష్టంగా చూపిస్తోందని వెల్లడించింది. 

పేలుడు పదార్థాలు ఎక్కువ రేట్లకు..

ఇతర ప్రభుత్వ రంగ సంస్థల కంటే సుమారు 30 శాతం ఎక్కువ రేట్లకు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది ప్రశ్నించిన అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఎదురయ్యాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని వెల్లడించింది.