calender_icon.png 28 January, 2026 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరిగోస పెడుతున్నరు!

28-01-2026 01:13:39 AM

విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు తక్షణం విడుదల చేయాలి

ప్రభుత్వ ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి!

ఉద్యోగులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహాధర్నా

ముషీరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను నడిరోడ్డుపై కాంగ్రెస్ వదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు విమర్శించారు.

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యం లో మంగళవారం ఇందిరా పార్కులోని ధర్నాచౌక్‌లో రాంచందర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డితో కలిసి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పెండింగ్ డీఏ, పీఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించకుండా ఉద్యోగులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కాం గ్రెస్ నెడుతున్నదన్నారు.

కేంద్రంలోని మోదీ సర్కారు పీఆర్సీలు, డీఏలు క్రమంగా ఇస్తుం టే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభు త్వం హక్కుపరంగా రావాల్సినవాటిని ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మండిప డ్డా రు. ప్రభుత్వ ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరిచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పెండిం గ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం దిగిరాక పోతే ప్ర భుత్వ ఉద్యోగులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ కొమరయ్య

రాష్ట్రంలో ఉన్న 21,500 మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, ఇన్సూరెన్స్, ఎన్ క్యాష్ మెంట్ బకాయిలను తక్షణ మే విడుదల చేయాలని బీజేపీ టీచర్స్ ఎమ్మె ల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. అధికారంలోకి 18 నెలలు గడుస్తున్న బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటున్నారన్నారు.

డీఏ, పీఆర్సీ, హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, పెన్షన్ బకాయిలను ఏకమొత్తంగా వెంటనే చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగు లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు.

ఆర్థిక సమస్యల్లో ఉద్యోగులు: ఎంపీ ఆర్ కృష్ణయ్య

ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి లెక్క మారిందని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు బకాయిల కో సం కాళ్లు కాయలు కాసేదాక ఎదురుచూస్తున్నారన్నారు. సమయానికి రావాల్సిన ప్ర యోజనాలు అందక ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లిస్తే పర్సెంటేజీలు వస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే రావ నే ఉద్దేశంతోనే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని విశ్రాంత ఉద్యోగులు వాపొతున్నారని విమర్శించారు.

రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని ఎమ్మె ల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించకుండా వారిని అరిగోస పెడుతున్నదన్నారు. వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అయి 22 నెలలు దాటి నా.. ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధ తో ఇప్పటి వరకు 40 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే వడ్డీతో సహా విడుదల చేస్తేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

మండలి ఎల్పీ లీడర్ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లు బీఆర్‌ఎస్ పాలనలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు హక్కుపరంగా రావాల్సినవాటిని ఇవ్వలేదన్నారు. ఆ తర్వా త అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగులను గాలికి వదిలేసిందన్నారు.

ఈ కార్యక్ర మంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాటేపల్లి జనార్థన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి (తపస్ రాష్ట్ర అధ్యక్షుడ), హన్మంతరావు, పెంటయ్య, రిటైర్మెంట్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామో దర్ రెడ్డి, తపస్, పీఆర్టీయూ నాయకులు, రిటైర్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో హజరయ్యారు.