calender_icon.png 1 May, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజమౌళి గురించి ఆ టెన్షన్ నాకు ఇప్పుడే మొదలైంది!

30-04-2025 10:07:30 PM

నాని కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాని హైదరాబాద్‌లో బుధవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాని పంచుకున్న సినిమా విశేషాలు.. 

పక్కింటి అబ్బాయిలా అనిపించే ఇమేజ్‌తో ప్రారంభమై నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా వైలెంట్ సినిమాలు చేస్తున్నారు.. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ఎలా చూస్తారు?  

-నేను దీన్ని ట్రాన్స్‌ఫర్మేషన్‌గా చూడటంలేదు. ప్రతి సినిమానూ ఒక కొత్త జోనర్‌లో చేయాలని ప్రయత్నం చేస్తాను. ‘హాయ్‌నాన్న’, ‘జెర్సీ’, ‘దసరా’ ఇప్పుడు ‘హిట్3’.. ఇలా ఇవన్నీ విభిన్నమైన సినిమాలే. ‘-హిట్3’ వైలెన్స్ సబ్జెక్టు డిమాండ్ బట్టే ఉంటుంది. తెరపై వైలెన్స్ చూస్తున్నప్పుడు అది డిస్ట్రబ్ చేసేలా ఉండదు.. ఎంజాయ్ చేసేలాగే ఉంటుంది. ‘సలార్’లో యాక్షన్ చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు.. ఇందులోనూ యాక్షన్ అలానే ఉంటుంది. అయితే కేసు తాలూకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా వైలెన్స్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాంటి వైలెన్సే ఉంటుంది. 

మీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుంటారు కదా.. వైలెన్స్ కారణంగా ఈ సినిమా ఏమైనా ప్రభావం ఉంటుందంటారా?

అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ జోనర్. టార్గెట్ ఆడియన్స్‌ను మెప్పిస్తే కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమా కచ్చితంగా టార్గెట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. 

మీ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.. ఈ నమ్మకాన్ని తెచ్చుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు?  

-నా పని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం వల్ల ప్రేక్షకుల్లో ఆ నమ్మకం కలిగింది. నన్ను, ప్రేక్షకులను సపరేట్ చేయను. నేనూ ప్రేక్షకుల్లో ఒకడినే అనే నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా.

టీజర్, ట్రైలర్‌లో చాలా వైలెన్స్ కనిపిస్తోంది.. ఇది ఎలాంటి సినిమా?

‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. ‘హిట్3’ కి వచ్చేసరికి యాక్షన్ వైలెన్స్ కథ డిమాండ్‌ను బట్టి వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. చాలా రిలేటబుల్, స్టులిష్‌గా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఈల వేయించే అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ సహజంగా కుదిరినవే. ఈ సినిమాను వైలెన్స్ కోసం తీయలేదు. కథలో సహజంగా వైలెన్స్ ఉంది. అది సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది.

‘హిట్3’లో ఎలాంటి ఎమోషన్ ఉంటుంది?

ఈ సినిమాలో చాలా మంచి ఎమోషనల్ హై ఉంది. అది ఒక ప్రామిస్ రిలేటెడ్ ఎమోషన్. అది చాలా బ్యూటిఫుల్‌గా హోల్డ్ అవుతుంది. అది మీరు బిగ్‌స్క్రీన్‌పై చూడాల్సిందే. 

ఈ సినిమా మీరే చేయడానికి కారణం ఏమిటి?  

అది సబ్జెక్టు డిమాండ్. ఈ సినిమా నేనే ఎందుకు చేశాను.. ఆ కారణం ఏంటనేది సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుందని భావిస్తున్నాను.

ఇలాంటి రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం.. తర్వాత అందులో నుంచి బయటపడటం కష్టం కదా..?! 

-ఏదైనా ఎగ్జుటైమెంట్ ఉంటే కష్టం అనిపించదు. నేను నా వర్క్‌ను చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే నాకు ఇది కష్టం అనిపించదు.

డైరెక్టర్ శైలేశ్ కొలను గురించి..?

-శైలేశ్ ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు కానీ తను చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. మాటల్లోనే జోకులు పేలిపోతుంటాయి. తనకు ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్తుంటాను. తను కామెడీ రాస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 

హీరోయిన్ శ్రీనిధిశెట్టి గురించి..?

-ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ఒక పర్పస్ ఉంటుంది. శ్రీనిధి క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ విషయాలు రివిల్ చేయకూడదు కానీ, చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తన సొంత సినిమా అన్నట్టుగా చాలా సపోర్టివ్‌గా ప్రమోషన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంది. తనకు డియన్స్‌లో చాలా మంచి క్రేజ్ ఉంది. తను ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.  

డీవోపీ షాన్ వర్గీస్ గురించి..?  

-షాన్ అద్భుతమైన కెమెరామెన్. ఆయన విజువల్‌తోనే ఒక స్టోరీ చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది.  ఒక షాట్ పెట్టేటప్పుడు.. అది ఆడియన్స్ ఏం ఫీలయ్యాలా చేస్తుందో అనే క్లారిటీతోనే పెడతారు. ఆయన విజువల్స్ ఎమోషన్‌ను ఎన్హాన్స్ చేస్తాయి. ఈ సినిమాకి వెరీ ఇంపాక్ట్ ఫుల్ కెమెరా వర్క్ ఇచ్చారు. 

మ్యూజిక్ కోసం మిక్కీ జే మేయర్‌ను తీసుకోవడానికి కారణం?

-మిక్కీ మంచి క్రాఫ్ట్ మ్యాన్. ఇప్పటివరకు మంచి ఫీల్‌గుడ్ సినిమాలు చేశారు. అయితే ఎప్పుడూ థ్రిల్లర్ చేయలేదు. ఆయన ఒకవేళ థ్రిల్లర్ చేస్తే ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన్ను తీసుకున్నాం. ఆయన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. 

‘హిట్3’ కోసం దేశమంతా తిరిగారు కదా.. ఎలా ఉంది స్పందన?  

-బ్రహ్మాండంగా ఉంది. షూటింగ్ కోసం అలాగే ప్రమోషన్స్ కోసం దేశ మొత్తం తిరిగాం. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమాను తప్పకుండా చూడాలని ప్రేక్షకులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. విడుదల కాకముందే ఇలాంటి ఒక పాజిటివ్ వైబ్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది.

‘హిట్3’కి అడ్వాన్స్ బుకింగ్స్ వైల్డ్ ఫైర్‌లాగా ఉన్నాయి.. మీరు ఎలాంటి ఓపెనింగ్స్, నంబర్స్ ఆశిస్తున్నారు?

-నెంబర్ గేమ్‌లో నేను కొంచెం వీక్. అయితే ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్‌కు రావడంలేదని తరచూ వింటున్నాం. కానీ ‘హిట్3’ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆకట్టుకునే కంటెంట్ మనం ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్‌కు వస్తారనేది నా అభిప్రాయం. 

‘హిట్3’తోపాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి.. ఈ పోటీని ఎలా చూస్తారు?

-అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. సినిమా రంగంలో ఉన్న అందరం అన్ని సినిమాలూ అద్భుతంగా ఆడాలని కోరుకోవాలి. అన్ని సినిమాలు ఆడితే అందరి బిజినెస్‌లూ పైకి వెళ్తాయి. ఓవరాల్‌గా ఇండస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. 

రాజమౌళి ‘హిట్’ ఫ్రాంచైజ్ సినిమాలకు చీఫ్‌గెస్ట్‌గా రావడం ఎలా అనిపిస్తుంది?

-రాజమౌళి అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్. ఎంత బిజీగా ఉన్నా ఆయన ఈ ఈవెంట్‌కు మిస్ అవ్వకూండా రావడం మాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. మూడు సినిమాలకూ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. తర్వాత వచ్చే సినిమాకు ఆయన చీఫ్ గెస్ట్‌గా రాకపోతే ఎలా అనే టెన్షన్ మొదలైంది (నవ్వుతూ).

‘పారడైజ్’లో వైలెన్స్ ‘హిట్3’కి మించి ఉంటుందా?

ఈ రెండూ దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. ‘పారడైజ్’ ఒక ఎపిక్ స్కేల్‌లో ఉంటుంది. ‘హిట్3’ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

చిరంజీవి అభిమానిగా ఆయనతో సినిమా నిర్మించడం ఎలా అనిపిస్తుంది? 

సాధారణంగా నిర్మాతలే యాక్టర్స్, డైరెక్టర్స్ దగ్గరకు వెళతారు. కానీ ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేస్తేనే బాగుంటుందని వాళ్లు అనుకోవడం.. అది నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు. (నవ్వుతూ) ఇదొక ప్రౌడ్ మూమెంట్.