30-04-2025 10:10:45 PM
“మేఘాల మధ్యలో నుంచి ఓపెన్.. రెండు కొండలు, వాటిమధ్య నుంచి క్లియర్ అవుతూ విలేజ్ వ్యూ. అప్పుడు ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లోని ఓ కుగ్రామానిదే ఆ వాయిస్. ‘నా పేరు బొగ్గులగుట్ట.. నాకు ఆ పేరు ఎందుకొచ్చిందో..” అంటూ మొదటి సన్నివేశం రాసి ఉన్న స్ట్రిప్ట్‌ను చూపిస్తూ గ్లింప్స్‌తోనే ‘శర్వా బ్లడ్ పీస్ట్’పై ఆసక్తి, అంచనాలు పెంచేశారు సంపత్ నంది.
ఇటీవల ‘ఓదెల2’ చిత్రంతో థియేటర్లలోనూ మల్లన్న జాతర సందడి కనిపించేలా చేశారారీ విజనరీ డైరెక్టర్ సంపత్ నంది. తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ‘శర్వా38’ ప్రాజెక్టు టైటిల్ ‘భోగి’ అని తెలియజేస్తూ స్పెల్‌బైండ్స్ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైందన్న శుభవార్తను సినీప్రియులకు అందించారు.
స్టార్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్టే ‘శర్వా38’. ఈ సినిమా టైటిల్‌ను ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా రివిల్ చేశారు. విధి, పోరాటం, మార్పు కథను దర్శకుడు సంపత్ నంది నరేట్ చేస్తుంటే.. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా ‘భోగి’ టైటిల్ రివిల్ అవుతుంది.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భారీ సెట్‌లో బుధవారం ప్రారంభమైంది. అందుకు సంబంధించి కొన్ని విజువల్స్‌ను తాజా కాన్సెప్ట్ వీడియోలో చూపించారు.
ఉత్తర తెలంగాణ. సరిహద్దుల్లో 1960లో జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించనున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీరాధామోహన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, ఎడిటర్ తదితర వివరాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.