calender_icon.png 9 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు

09-10-2025 04:57:49 PM

సందిగ్ధంలో స్థానిక సంస్థల ఎన్నికలు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలుపై కాసేపటి క్రితం హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2 రోజులు వాదనలు విన్న హైకోర్టు, జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్పైనా స్టే ఇచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.