calender_icon.png 20 May, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు

20-05-2025 04:28:13 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు నికరమైన ఆదాయం లభిస్తుందని, సాధారణ పంటల సాగుతూ పోలిస్తే అధిక లాభం పొందవచ్చని ఆయిల్ పామ్ ఎఫ్ ఓ పునీత్ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో రావుల మల్లేశం అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంట సాగును పరిశీలించి సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుకు నీల అనువైనదని, రైతులు అపోహలకు గురికాకుండా లేకుండా ఆయిల్ పామ్ పంట సాగు చేయవచ్చని తెలిపారు. మొక్కలు నాటే దగ్గర నుండి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం హార్టికల్చర్ శాఖ ద్వారా వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారని, నెల్లికుదురు, ఇనుగుర్తి మండల పరిధిలో 560 ఎకరాల్లో ఈ ఏడాది ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.