20-05-2025 10:09:05 PM
ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..
హనుమకొండ (విజయక్రాంతి): ఓ భూవివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం సహకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) ఉత్తర్వులు జారీ చేశారు.