20-05-2025 10:22:50 PM
చిన్నశంకరంపేట/చేగుంట (విజయక్రాంతి): చిన్నశంకరంపేట మండలం సూరారం అడవి ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహం లభించిందని చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్(SI Narayana Goud) తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు... గత మార్చి నెలలో నిజాంపేట మండలం చెందిన వజ్జా బాల మల్లవ్వ(54) చిన్న శంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో మార్చి నెలలో బీరప్ప జాతరకు వచ్చి తప్పిపోయారు. వారి కుటుంబ సభ్యులు చిన్న శంకరంపేటలో 13-3-2025 రోజున దరఖాస్తు ఇవ్వగా మిస్సింగ్ కేసు కింద 14-3-2025 నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు.