20-05-2025 10:20:06 PM
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..
బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల(Boath Mandal) కేంద్రంలో షేక్ అమన్(18) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక న్యూ కాలనీకి చెందిన షేక్ అమన్ వేసవి సెలవుల కారణంగా కొన్ని రోజులుగా ఎండలో క్రికెట్ ఆడుతున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం క్రికెట్ మైదానంలో అస్వస్థత గురై తీవ్ర వాంతులు చేసుకోగా స్థానికులు బోథ్ అస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వడదెబ్బ వల్ల యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.