20-05-2025 10:13:56 PM
వైరా (విజయక్రాంతి): సెల్ ఫోన్ మర్చిపోయిన ప్రయాణికునికి వైరా బస్టాండ్(Wyra Bus Stand) కంట్రోలర్ వెంకన్న, ప్యాసింజర్ గైడ్ కోట నాగేశ్వరరావులు వ్యక్తికి తిరిగి సెల్ ఫోన్ ను మంగళవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మాలోత్ నరసింహ ఖమ్మం వెళ్లుటకు వైరా బస్టాండ్ కు వచ్చి సెల్ ఫోను మరిచి ఖమ్మం బస్సు రాగానే హడావాడిగా బస్సు ఎక్కాడు. కొద్దిసేపటికి బస్టాండ్ లో ఓ సెల్ ఫోన్ తారసపడటంతో గమనించిన కంట్రోలర్ వెంకన్న, ప్యాసింజర్ గైడ్ కె. నాగేశ్వరరావులు ఆ ఫోన్ను భద్రపర్చారు. ఆ ప్రయాణికుడు ఫోన్ పోయిన విషయం గమనించి తిరిగి వైరా బస్టాండ్ కు రాగా అతనికి అప్పగించారు. దీంతో అతను ఆర్టీసీ సంస్థతో పాటు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.