20-05-2025 10:32:01 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): సీఎంఆర్ఏఫ్ చెక్కు పేదలకు వరం అని ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి(MLC Dr. Yadava Reddy) అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన బోగర్ల కనకమ్మ అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందారు. అనంతరం మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి చొరవతో సీఎంఆర్ఏప్ కు దరఖాస్తూ చేసుకోగా మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కు బాధితురాలు భర్త భోగర్ల ఈదులుకి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చేతులు మీదుగా రూ.30,000 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మా మాజీ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు కావ్య దర్గయ్య, ఎండి అఫ్జల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.