calender_icon.png 20 May, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం..

20-05-2025 04:32:32 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్ కళా బంకెట్ హాల్ లో 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66వ డివిజనులు, ఐనవోలు, హసన్ పర్తి మండలాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ అబ్జర్వర్ మాక్సూద్ అహ్మద్, టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... టీపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేపట్టడం జరిగిందని అన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నూతన అధ్యక్ష కమిటీల ఎంపికపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోందని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ తరుణం ఉపయోగకరంగా ఉండబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసి ఉత్తమ ఫలితాలను అందించారని, ప్రజలకు పార్టీకి వారధులుగా నిలిచిన వారికి ఈ కార్యక్రమం ద్వారా నూతన ఒరవడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల బలమే, ఎన్నికలే పార్టీకి పునాది అని, సామాజిక సమీకరణ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ముఖ్యమని అన్నారు.

ఎంపిక, ఎన్నిక పద్ధతితో పార్టీ కమిటీలో నియామకం చేయాలి అన్నారు. గెలుపు గుర్రాలకే ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాం అని, కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది అని చెప్పడానికి వర్ధన్నపేట నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని తెలిపారు. కార్యకర్తల కృషితోనే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం, కులగనను చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు గౌరవం ఉంది, జెండా పట్టి పార్టీని గెలిపించే వారే నిజమైన కాంగ్రెస్ వాది అని అన్నారు. క్రింది స్థాయి నుండి వస్తేనే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. గ్రూపులు పెట్టవద్దు అని, కష్టపడ్డా కార్యకర్తకు పార్టీ గుర్తింపు లభిస్తుందని అన్నారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి బ్లాక్ అద్యక్షులు, మండల, డివిజన్, గ్రామ స్థాయి అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి రెడ్డి, 56వ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, జిల్లా నాయకులు వీసం సురేందర్ రెడ్డి, గడ్డం శివరాం ప్రసాద్, చింత రమేష్ గౌడ్, దూలం సదానందం గౌడ్, రుద్రోజ్ మణింద్రనాథ్, విజయ్ నాయక్, లావుడియా రవి నాయక్, శనిగరపు అనిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.