calender_icon.png 20 May, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

20-05-2025 03:44:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ, యూరాలజీ, జనరల్ వార్డ్, హాస్పటల్ ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్ వార్డులను పరిశీలించారు. డాక్టర్స్, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవల వివరాలు సుపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించాలని, హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సదరం క్యాంపు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో వారి కి సేవలు అందించడానికి యుఐడి (బ్లాక్) నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్పెషలైజేషన్ మానసిక, కంటి, చెవి, ముక్కు, దంతాలు, వినికిడి లోపం ఉన్న వారిని పరీక్షించేందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా నాణ్యమైన, స్వచ్ఛమైన పదార్థాలను ఉంచాలని సూచించారు.ఆస్పత్రిలో పార్కింగ్, వైద్య విభాగాలు , సానిటేషన్ నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఈ, ఏఈ,  శంకర్, సంబంధిత విభాగాల సిబ్బంది ఉన్నారు.