6 May, 2026 | 2:38 AM

పామ్‌ఆయిల్ సాగుతో అధిక లాభాలు

06-05-2026 01:10 AM

తాడ్వాయి, మే, 5( విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఎల్లారెడ్డి ఏడిఏ సుధారాణి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో మంగళవారం ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడానికి ప్రణాళికలు చేసుకోవాలన్నారు. అత్యధికంగా వంట నూనెల దిగుబడినిచ్చే పంటలలో ఆయిల్ ఫామ్ ప్రధానమైనదని తెలిపారు. ఒక ఎకరా వరి పొలము పండించడానికి అవసరమయ్యే నీటితో రెండు మూడు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గుచూపులున్నారు. ఆయిల్ పామ్ తో మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఏరువాక శాస్త్రవేత్త అనిల్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు పాత పద్ధతులు పాటించకుండా అధునాతన వ్యవసాయం వైపు మొగ్గుచూపా లన్నారు. నూతన పద్ధతులు ఉపయోగించుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాలను తగ్గించుకోవాలన్నారు. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకొని అధిక దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర పహాడ్ సర్పంచ్ మల్లవ్వ,సదాశివ నగర్ ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, ఏవోలు అశోక్, రాజలింగం, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు.