6 May, 2026 | 2:38 AM

నూతన కార్యవర్గం ఎన్నిక

06-05-2026 01:08 AM

అర్మూర్, మే 5 (విజయక్రాంతి): అర్మూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో సమావేశాన్ని నిర్వహించి నూతన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షునిగా రెవరెండ్ కె. విలియం, ఉపాధ్యక్షుడిగా రెవరెండ్ బి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా రెవరెండ్ ఎస్.మార్క్, కోశాధికారిగా రెవరెండ్ యు.దయాసాగర్ సహాయ కార్యదర్శిగా రెవరెండ్ కె.జాన్ పీటర్, సహాయ కోశాధికారిగా రెవరెండ్ పి.స్టీవెన్, గౌరవ అధ్యక్షుడిగా రెవరెండ్ ఎం.ఇమ్మానుయేల్ లను ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా రెవరెండ్ బి.జాకబ్, రెవరెండ్ పి.డేవిడ్ రాజ్, ఫోటోగ్రాఫిక్ గా రెవరెండ్ జి.రవి విల్సన్ లను ఎన్నుకున్నారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. సమావేశం ఆరంభానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు.ఆర్మూర్ నియోజకవర్గంలోని దళిత పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.