09-01-2026 12:00:00 AM
కలెక్టర్ హరిచందన దాసరి
సికింద్రాబాద్, జనవరి 8 (విజయ్‌క్రాంతి): హైదరాబాద్ జిల్లాను క్రీడల్లో ముందు వరుసలో ఉంచాలని ,అందుకు క్రీడాకారులు నైపుణ్యాలకు మరింత పదును పెట్టా లని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం జింఖానా గ్రౌండ్ లోని సీఎం కప్ రెండో ఎడి షన్‌ను అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా నుండి అన్ని క్రీడలలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
అంతకు ముందు కలెక్టర్ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ జిల్లా క్రీడా కార్యక్ర మాల్లో భాగంగా అనేక క్రీడలలో పాల్గొనడంలో జిల్లా రాష్ట్రం లో ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా సిద్ధమై ఉన్న యువ క్రీడాకారులను చూడ టం ఎంతో ఆనందంగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయి రాం, జిల్లా యువజన క్రీడల అధికారి సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వినీల, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, పిఈటిలు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.