05-12-2024 10:51:52 AM
కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం అరెస్ట్ అయ్యారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లో విధులు అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండాపూర్ లో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి, శంభీపూర్ రాజు, జగదీశ్వర్ రెడ్డి, హరీశ్ రావు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలను గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.