పంట మార్పిడితోనే అధిక లాభాలు
రాజాపూర్ మార్చి 31 : రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు అర్జించవచ్చని తెలంగాణ విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన అన్నారు. మంగళవారం ఈద్గాన్ పల్లి గ్రామంలోని రైతు వేదిక భావనంలో పంట మార్పిడి విధానం పై రైతులకు అవగాహన కల్పించారు.
నేల సారం పెంచేటటువంటి పప్పు దినుసులు పెసర్లు,మినుములు,నూనెగింజల పంటలు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటలు యాసంగిలో వరి కి బదులుగా సూచించారు.మార్కెట్ రేటుకు అనుగుణంగా రైతులు పంటలను వేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పంచాక్షరి, వార్డు సభ్యులు శివ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ రెడ్డి ,పంచాయతీ సెక్రటరీ బాసు,రైతులు కిష్టయ్య, జంగయ్య, లక్ష్మయ్య, నరసింహ రెడ్డి,శ్రీనివాసులు, రాఘవేంధర్, గంగాధర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.




