1 April, 2026 | 2:37 AM

గడ్డి మందును నిషేధిస్తూ తీర్మానం హర్షనీయం

01-04-2026 12:00 AM

ప్రభుత్వానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభినందనలు

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): పారక్వాట్ గడ్డి మందును నిషేదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. అత్యంత విషపూరితమైన పారక్వాట్ గడ్డి మందు వల్ల రాష్ట్రంలో చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రైతు కమిషన్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో కోదండరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

గడ్డి మందు, కలుపు మందు నిషేదించాలని ఇండియన్ మెడికల్ అసోషియేషన్, రైతు సంఘా లు.. రైతు కమిషన్ దృష్టికి తీసుకొస్తే.. తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతు కమిషన్ విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి తీర్మానం చేయడం సంతోష కరమన్నారు.

పంటల మార్పిడి విధానంపై రైతుల్లో అవగాహన తీసుకురావాలని అధికారులకు సూచించారు. కమిషన్ సభ్యులు గోపా ల్‌రెడ్డి, భవానీరెడ్డి, కేవీఎన్‌రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్, వ్యవసాయ అధికారులు గీతారె డ్డి, సుచరిత, శ్రీధర్, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి, స్రవంతి పాల్గొన్నారు.