17-11-2025 01:20:35 AM
జోహార్లు అర్పించిన పలు సంఘాల నేతలు
ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి); ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యా య ఉద్యమ నిర్మాణంలో ఎనలేని కృషిచేసిన ఉపాధ్యాయ నాయకుడు, ఏపీటీఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి, సమసమాజ స్వప్నికుడు కే. నారాయణ భౌతికంగా దూరమయ్యారు.
ఆయనకి పిడిఎస్యు, పిఓడబ్ల్యూ, ఐఎఫ్టియు కార్యవర్గా లు ఆదివారం విప్లవ జోహార్లను అర్పించారు. ఆయన జీవిత కాలం మొత్తం ఉపా ధ్యాయ రంగంలో పనిచేస్తూ నిరుపేద విద్యార్థుల విద్య భవిష్యత్తు కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సరళ, ఐఎఫ్టియు జాతీ య నాయకులు విజయ్, పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. గణేష్, ట్రేడ్ యూనియన్ నాయకులు భాస్కర్. సమ్మయ్య, నరసయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.