10 April, 2026 | 1:39 AM

610 కిలోల నుంచి 63 కిలోలకు

15-08-2024 12:27 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 14: అతడి బరువు 610 కిలోలు.. కదలటానికి కూడా వీలులేని పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు మంచానికే పరిమితమయ్యాడు. కానీ, ఏడాది తిరక్కుండానే అనూహ్యంగా 63.5 కిలోలకు తగ్గాడు. అతడే సౌదీ అరేబియాకు చెందిన ఖాలెద్ బిన్ మొహసెన్ షారీ. ఇతడు భూమిపై బతికి ఉన్న అతి భారీ కాయుడిగా గుర్తింపు పొందాడు. సౌదీ రాజు కింగ్ అబ్దుల్లా సాయంతో రియాద్‌లోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీ దవాఖానలో వైద్యం లభించటంతో ఊహించని విధంగా బరువు తగ్గాడు. అతడి స్వస్థలం జహన్ నుంచి రియాద్‌కు తరలించేందుకు ఏకంగా ప్రత్యేక వాహనాన్నే తయారుచేయాల్సి వచ్చింది. అతడు భారీకాయుడిగా ఉన్నప్పటి ఫొటో, ప్రస్తుతం 63 కిలోల వ్యక్తిగా ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.