21 May, 2026 | 2:32 AM

నల్లమల నుంచే రేవంత్ రెడ్డి రాజకీయ పతనం

21-05-2026 12:17 AM

అచ్చంపేట మే 20: అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని బిజెపి నేత మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ గువ్వల బాలరాజ్ ధ్వజమెత్తారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్లమల ముద్దుబిడ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలను, రైతుల ను, నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు, బూతు పురాణాలు, మోసపూరిత గ్యారంటీలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. పాలమూరు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు, భూముల వ్యాపారాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

పాలమూరు ప్రజల ఆ కాంక్ష అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఉమామహేశ్వర వంటి కీలక ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఉద్దేశపూర్వకం గా అడ్డుకుంటున్నారని అన్నారు. తాను ఎ మ్మెల్యేగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఉ మామహేశ్వర ప్రాజెక్ట్ భూ సేకరణ పనుల ను కూడా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అడుగడుగునా అడ్డుకుంటూ రైతులకు తీవ్ర అ న్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లు అందకుండా చేసి రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డా రు.

మద్దిమడుగు అంజన్న పాదాల సాక్షిగా చెబుతున్నా& నల్లమల నుంచే రేవంత్ రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు బనాయించడం, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ నైజమైందన్నారు. రైతుల తరఫున పోరాడుతున్న నాయకులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వంతో చర్చించి అచ్చంపేట నుంచే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామ ని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు, మంగయ్య నాయక్ జానకి శీను నాయక్ శంకర్, శ్రీనివాస్ గౌడ్ శివచంద్ర చందూలాల్,తదితరులు పాల్గొన్నారు.