calender_icon.png 7 July, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ నేషన్ హుడ్ గ్రంథావిష్కరణ

07-07-2025 12:44:48 AM

గజల్ శ్రీనివాస్ ఆలపించిన హిందూ చైతన్య తమిళ గీతం విడుదల

హైదరాబాద్, జూలై ౬ (విజయక్రాంతి): స్వర్గీయ డాక్టర్ కలికివాయి మహంకాళిరావు రాసిన హిందూ నేషన్ హుడ్ గ్రంథాన్ని ఆదివారం విజిల్ సంస్థ, చెన్నై మద్రాస్ సంస్కృ త కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సభలో నాగాలాండ్ గవర్నర్ ఎల్‌జి గణేషన్ ఆవిష్కరించారు.సనాతన ధర్మం వైపు ప్రపం చం చూస్తోందని,భారతీయ ప్రాచీన యోగా, వైద్యం, జీవన విధానం వైపు ప్రపంచ యువ త ఆసక్తి చూపుతోందని ఆయన అన్నారు.

హిందుస్థాన్ యథాతథ చరిత్రను ఈనాటి తరం వారికి అందజేయాలని, ఆ ప్రయత్నం చేసిన డాక్టర్ కెఎమ్.రావు మనకు స్ఫూర్తి దా యకమని ప్రశంసించారు. హిందూ మున్న నీ, సేవ్ టెంపుల్స్ భారత్ సంయుక్త రూపొందించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ తమిళంలో ఆలపించిన ఇందువాగ నీ ఇరుందాల్ హిం దూ చైతన్య గీతాన్ని గవర్నర్ విడుదల చేశా రు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ మంత్రి హెచ్‌వి హాండే, ప్రముఖ నర్తకి పద్మశ్రీ పద్మాసుబ్రహ్మణ్యం, జయంతి నటరాజన్, గ్రంథ రచయిత శబరీష్, సుజాతా మహంకాళిరావు, హిందూ మున్ననీ చెన్నై అధ్యక్షుడు ఎలాన్ గోవన్ పాల్గొన్నారు.