calender_icon.png 13 November, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత సూచనలు చేయడానికి హోల్డింగ్ రూమ్ ఏర్పాటు

13-11-2025 10:31:24 PM

ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్..

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం వద్ద జాతీయ రహదారి 65 కు పక్కన రోడ్డు భద్రత నియమాలు పాటించడానికి పోలీస్ వారి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన హోల్డింగ్ రూమ్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ప్రయాణికులకు అర్థమయ్యేలా తెలియపరిచేందుకు రహదారి పక్కన హోల్డింగ్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రయాణికులు కొన్ని తెలిసి కూడా చేసే తప్పిదాల వల్ల వాళ్ల ప్రాణాలు కోల్పోవడమో, లేదంటే ఎదుటివారి ప్రాణాలు కోల్పోవడానికి కారకులవుతున్నారని, ముఖ్యంగా అతివేగం, రాంగ్ రూట్లో రావడం, రోడ్ దాటేటప్పుడు ఇండికేటర్స్ వేయకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రోడ్డు భద్రత నియమాలను పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి హోల్డింగ్  బోర్డు ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, ప్రాణం నష్టం జరగకుండా పలు సూచనలు చేస్తూ ప్రమాదాలను నివారించడానికి  ఈ బోర్డులను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శివరాం రెడ్డి, సీఐ కే.నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.