సిరికొండలో ఘనంగా హోలీ పండుగ
సిరికొండ, మార్చి 3 (విజయక్రాంతి): సిరికొండ మండల వ్యాప్తంగా మంగళవారం హోలీ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే గ్రామాల్లో యువత రంగులతో వీధుల్లోకి వచ్చి సందడి చేశారు. చిన్నారులు, పెద్దలు పరస్పరం రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.అనేక గ్రామాల్లో సంప్రదాయ ప్రకారం కామదహనం నిర్వహించి, అనంతరం రంగులాటలో పాల్గొన్నారు.
డీజే సంగీతం, హోలీ పాటలతో గ్రామాలు కళకళలాడాయి. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండి పలు గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వేడుకలు సాఫీగా సాగాయి.మొత్తంగా సిరికొండ మండలంలో పాత్రికేయ మిత్రుల రంగుల హోలీ పండుగ హర్షంతో ముగిసింది.




