2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

రెండు నెలలుగా ఖాళీగా కోదాడ రూరల్ సీఐ పోస్టు

04-03-2026 12:42 AM

కోదాడ, మార్చి 3 : కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) పదవి రెండునెలలుగా ఖాళీగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఐగా ఉన్న ప్రతాప్ లింగం సస్పెండ్ కావడంతో ప్రస్తుతం ఇన్చార్జ్ అధికారి ఆధ్వర్యంలోనే వ్యవహారాలు కొనసాగుతున్నాయి.పలు గ్రామాలు, సున్నిత ప్రాంతాలు ఉన్న ఈ పరిధిలో పూర్తి స్థాయి సీఐ లేకపోవడంతో కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం పడుతున్నట్టు సమాచారం.

ఇటీవల చోరీలు, భూవివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత నియామకం అత్యవసరమని ప్రజలు కోరుతున్నారు. రెండు నెలలు గడిచినా అధికారిక ప్రకటన రాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తక్షణమే శాశ్వత సీఐని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.