calender_icon.png 21 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ ప్రేమకథలో హాలీవుడ్ హీరోయిన్!

21-09-2025 01:19:34 AM

భారతీయ నటీనటులు హాలీవుడ్ సినిమాల్లో నటిం చటం తరుచూ జరుగుతోంది. హాలీవుడ్ యాక్ట ర్స్ ఇండియన్ సినిమాల్లో భాగమవడం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా మరో ఓ హాలీవుడ్ హీరో యిన్‌ను బాలీవుడ్ సినిమాలోకి తీసుకొస్తున్నారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి మరీ ఆ విదేశీ బ్యూటీని మన సినిమాలో భాగం చేస్తుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. హాలీవుడ్ నటి సిడ్నీ స్వీని హాలీవుడ్‌లో సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మంచిగుర్తింపు తెచ్చుకుంది.

సోషల్‌మీడియాలోనూ పాపులర్ అయి, ఇటీవల బాగా వైరల్ కూడా అయింది. హాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక సినిమాకు దాదాపు రూ.100 కోట్లపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సిడ్నీ స్వీని ఇప్పుడిప్పుడే ఆ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తోంది. దీంతో ఆమె పాపు లారిటీని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది ఓ బాలీవుడ్ సంస్థ. ఇందులో భాగంగా ఆమెను కలిసి ఓ కథ వినిపించారని, ఇండియన్ సినిమాలో నటించాలని అడిగారని, రెమ్యూనరేషన్‌గా భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని టాక్.

పారితోషికం రూపేణా రూ.415 కోట్లు, మరో రూ.115 కోట్లు స్పాన్సర్‌షిప్ అగ్రిమెంట్ల ద్వారా చెల్లించేందుకు అంగీకరించారట. అంటే, ఈ లెక్కన ఈ హాలీవుడ్ భామకు ఒక సినిమాకే రూ.530 కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందన్నమాట. ఓ హాలీవుడ్ హీరోయిన్ ఇండియన్ హీరోతో ప్రేమలో పడటమే ఈ సినిమా కథ అని, ఈ సినిమా షూటింగ్ పారిస్, న్యూయార్క్, లండన్, దుబాయ్‌లో ఉంటుందని సమాచారం. మరి సిడ్నీ స్వీని ఈ ఆఫర్‌ను స్వీకరిస్తుందా? ఈ విషయమై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఏమైనా చేస్తుందా చూడాలి.