calender_icon.png 21 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Knm 1658 రకం వరిక్షేత్ర పరిశీలన...

21-09-2025 12:52:19 AM

నాగారం: జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన నాణ్యమైన వరి, పెసర విత్తనాలను సరఫరా చేసి విత్తనోత్పత్తిని గ్రామాలలో రైతులను ప్రోత్సహించేందుకు గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సీడ్ ఇన్ ఎవరీ విలేజ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా G.స్వాతి అసిస్టెంట్ ప్రొఫెసర్ N. నలిని అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ పరిశోధన స్థానం, కంప సాగర్, నాగారం మండలంలోని నాగారం, వర్ధమానుకోట, ఈటూరు,  గ్రామాలలోని వరి కేఎన్ఎం 1638 మరియు పెసర ఎంజిజి 385 క్షేత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో కొత్త రకాలలో ఎదుగుదల, పిలకల శాతం, పురుగులు, తెగుళ్లను లక్షణాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి.  కృష్ణ కాంత్, సాయిరాజ్, . బి సంధ్ ,. జి శ్రీను   రైతులు బద్దం వెంకటరెడ్డి, ఆకారపు శ్రీను, మోదుగు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.