calender_icon.png 21 September, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆత్మనిర్భర్’ భారత్ కావాలి

21-09-2025 01:06:03 AM

-విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు

-భావితరాల భవిష్యత్తును ఫణంగా పెట్టం..

-దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం..

-గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

-అమెరికా హెచ్‌ఁ వీసాల దరఖాస్తు రుసుము పెంపు నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు 

గాంధీనగర్, సెప్టెంబర్ 20: భారత్‌కు ప్రధానమైన శత్రువులెవరూ లేరని, విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఇక పై ఇతర దేశాలపై ఆధారపడకుండా ‘విశ్వబంధు’ స్ఫూర్తితో ‘ఆత్మనిర్భర్’ దేశంగా అవ తరిస్తుందని ఆకాంక్షించారు. హెచ్ వీ సాల దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని స్పందించారు. శనివారం ఆయన గుజరాత్‌లోని భావనగర్‌లో పర్యటించారు.

‘సముద్ సే సమృద్ధి’ కార్యక్ర మంలో భాగంగా రూ.34,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశాభివృద్ధి కుంటుపడు తుందని, దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీ యుల భవిష్యత్తును ఇతర దేశాల చేతిలో పెట్టబోమని, వందలాది సమస్యలకు ఒకటే పరిష్కారమని, అదే స్వావలంబన భారత్ అని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్వావలంబన కోసం భారత్ ఇకపై స్వయం సమృద్ధి ప్రగతిపై దృష్టి సారిస్తుందన్నారు. అందుకు దేశ ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. విదేశాల కోసం దేశాభివృద్ధిని, భావితరాల భవితను ఫణంగా పెట్టబోమని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ వైఫల్యాలు..

స్వాతంత్య్రానంతరం దేశ పారిశ్రామిక, వాణిజ్య సామర్థ్యాలు పెం చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. ప్రపంచీకరణ తరుణం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుమతులపై ఆధారపడిందని, ద శాబ్దాల పాటు దేశాన్ని ప్రపంచ మా ర్కెట్ నుంచి వేరు చేసిందని.. దీంతో పారిశ్రామిక, వాణిజ్యపరమైన వైఫల్యాలకు ఆస్కారం కలిగిందని పేర్కొ న్నారు. దేశ సామర్థ్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం వల్లనే.. భా రత్‌కు దక్కాల్సిన విజయాలు అంత గా దక్కలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విధానాలతో దేశ శక్తియుక్తులు ప్రపంచానికి తెలియకుండా చే శాయని  వివరించారు.