calender_icon.png 21 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షారుక్ చెప్పిన పాఠాన్నే అమలు చేస్తున్నా

21-09-2025 01:18:12 AM

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకోవడం ఇప్పుడు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన నేపథ్యంలో దీపిక.. ఇన్‌స్టాలో పెట్టిన తాజా పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తు తం షారుక్‌ఖాన్‌తో కలిసి ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్న దీపిక పడుకొణె.. ఆయన 18 ఏళ్ల క్రితం తనకు ముఖ్యమైన పాఠాలు చెప్పారంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. “18 ఏళ్లక్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్ కొన్ని పాఠాలు నేర్పారు.

సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే.. సినిమా విజయం కంటే ప్రాధాన్యమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలనే పూర్తిగా నమ్ముతాను. అప్పట్నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్నే అమలుచేస్తున్నాను. అందుకే ఆయనతో ఇప్పుడు నేను ఆరో సినిమా చేయగలుగుతున్నాను” అని రాసుకొచ్చారు. అయితే, దీపిక ‘కల్కి2’ నుంచి తప్పుకున్న సమయంలోనే ఈ పోస్ట్ పెట్టడంతో తన నిర్ణయాన్ని పరోక్షంగా సమర్థించుకుంటున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.