calender_icon.png 23 December, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సైబర్ ఉచ్చులో పడకండి...

22-12-2025 10:25:37 PM

అవగాహన సదస్సులో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి 

ఉప్పల్,(విజయక్రాంతి):  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబలి అన్నారు.   నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోలీ ఫెయిత్ స్కూల్ సైబర్ అవగాహన సదస్సును  సోమవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మైబల్లి  మాట్లాడుతూ   ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటూ  కొందరు కేటుగాళ్లు  వివిధ మాయమాటలతో బురిడీ కొట్టించి  ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.

విద్యార్థులు నేరాల పట్ల  అవగాహన ఎంతో అవసరమని  వాట్సప్ టెలిగ్రామ్ ల పట్ల  అప్రమత్తంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.  పోలీసుల పనితీరు  సోషల్ మీడియా మోసాలు మహిళల భద్రత పట్ల  విద్యార్థులకు అవగాహన పెంపొదించేలాగా తెల్చపరిచారు . పోలీసుల సైబర్ హెల్ప్ లు  ఉపయోగించుకొని మీ చుట్టుపక్క ఏదైనా నేరం జరిగినప్పుడు  వెంబటే పోలీసుకు తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం మార్క ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ  విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సైబర్ అవేర్నెస్ పిసి  అనిల్  సిబ్బంది నవీన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు