calender_icon.png 23 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

23-12-2025 12:00:25 AM

ఏరియా ఆసుపత్రి మార్చురిలో మృతదేహం

మిర్యాలగూడ,(విజయక్రాంతి): మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం వెలుగు చూసింది. మిర్యాలగూడ గ్రామీణ  ఎస్సై లక్ష్మయ్య  తెలిపిన వివరాల ప్రకారం.... మిర్యాలగూడ రైల్వేస్టేషన్ కీ మాన్ శ్రవణ్ కుమార్ సోమవారం లైన్ చెకింగ్ చేస్తున్న క్రమంలో స్టేషన్ కి 150 మీటర్ల దూరంలో ఓ వ్యక్తి మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు మరణించిన వ్యక్తి కి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మృతుని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, శరీరం పై. నలుపు రంగు జీన్స్, తెలుపు నీలం రంగు గీతల అంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు.  అతని చేతి పై ఐ లవ్ యు రాజ్,  వెంకటేష్, లోకేష్ అన్న టాటూ మార్క్ ఉందన్నారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లుగా  గుర్తించి మృత దేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురి కి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 70189, 8712670151 నంబర్ల కు సమాచార మివ్వాలని కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.