22-12-2025 10:22:00 PM
కొలువుతీరిన కొత్త సర్పంచులు
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని కొన్ని గ్రామాలలో కొత్త సర్పంచులచే ప్రమాణ స్వీకారం చేయించిన పంచాయతీ కార్యదర్శులు. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా సురేష్, చిన్నతండపాడు సర్పంచ్ గా మహేశ్వరమ్మ, మేడికొండలో లైజమ్మ, వెంకటాపురంలో చిన్న బీమా రాయుడు, ఉత్తానుర్ లో దగ్గుపాటి రాణి, పులికల్ సర్పంచ్ గా మాణిక్యమ్మ, ఉప్పలలో తిమోతి, ఉప్పల క్యాంపులో రాణి మొదలగువారితో పంచాయితీ కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమింపబడిన సర్పంచ్ లు గ్రామాభివృద్ధిలో రెపటి నుండి కార్యరూపం చేపటతామన్నారు.