calender_icon.png 23 December, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష

22-12-2025 11:50:00 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చెక్ బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 15 లక్షల జరిమాన విధిస్తూ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ముఖేష్ తీర్పు ఇచ్చినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

2021 సంవత్సరం లో కాల్ టాక్స్ కు చెందిన  బంక కుమార్ కు  బూడిదగడ్డ బస్తీకీ చెందిన దాసరి విజ్ఞాన్  ఇచ్చిన రూ. 12 లక్షల చెక్ బౌన్స్ అయింది. దీంతో బంక కుమార్ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశాడు. సోమవారం  నేరం రుజువు కావడంతో  దాసరి విజ్ఞాన్ కు మేజిస్ట్రేట్  జే ముకేశ్   సంవత్సరం జైలు శిక్ష, పది హేను లక్షల  జరిమానా విధించారనీ ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు వెల్లడించారు.