calender_icon.png 23 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా వన్నారం గ్రామపంచాయతి పాలకవర్గ ప్రమాణ స్వీకారం

22-12-2025 11:43:56 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని వన్నారం, శంషాబాద్ గ్రామ పంచాయతి పాలకవర్గాల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ఆయా గ్రామాల ప్రజల సమక్షంలో అధికారులు నిర్వహించగా సీనియర్ సిటిజన్ ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావు హాజరై నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. వన్నారం, శంషాబాద్ గ్రామాలలో నిర్వహించిన పంచాయతి పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో  పోలాడి రామారావు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికైన గ్రామాల సర్పంచ్ లు పార్టీల కతీతంగా, వర్గాల కతీతంగా అందరినీ సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అధికారులు,ప్రజా ప్రతినిధుల సహకారం తో పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో గొడవలకు తావు లేకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలని కోరారు.

గ్రామ పంచాయతి సర్పంచ్ పదవి ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నత పదవి అని రామారావు అన్నారు. వన్నారం, శంషాబాద్   గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, పాలకవర్గాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయా గ్రామస్థుల హర్షధ్వానాల మధ్య పోలాడి రామారావు తెలిపారు . ఇటీవల గట్టు దుద్దెనపల్లి, శంషాబాద్ ప్రధాన రహదారిని సొంత నిధులతో  లక్ష రూపాయల వ్యయం చేసి మరమ్మత్తులు చేసినట్టు ఆయన వివరించారు. వన్నారం, గంగిపల్లి మల్లికార్జున ఆలయం వరకు నాలుగు లక్షల రూపాయల నిధులతో రెండు గ్రామాల ప్రజలకు సేవ చేశానని అందరి హర్షద్వానాల మధ్య ఆయన ప్రకటించారు.

మే 12- 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వన్నారం గ్రామానికి వచ్చిన సందర్భంగా గట్టుదుద్దెనపల్లి నుండి శంషాబాద్, వన్నారం, ఎరడపల్లి, ఆర్కండ్ల ,చల్లూరు వరకు సుమారు 16 కిలోమీటర్ల బీటీ రోడ్డును మంజూరు చేయడానికి కృషి చేసినట్టు ఆయన ప్రజలు వివరించారు. ఇలాగే సేవ చేయటానికి తను సర్వదా సన్నిద్ధంగా ఉంటానని చెప్పారు. నూతనంగా ఎన్నికైన వన్నారం గ్రామ పంచాయతి సర్పంచ్ తాళ్ళపల్లి సంపత్, ఉప సర్పంచ్ భాకారపు రాములు, శంషాబాద్ సర్పంచ్ మేరుగు కళావతి సంపత్, ఉప సర్పంచ్ డొల్ల సతీశ్ లను శాలువాలు కప్పి, ఆత్మీయ సత్కారాన్ని అందించారు.  అంతకు ముందు  రెండు గ్రామాల స్పెషల్ ఆఫీసర్, మండల పరిషత్ ఏఈ వెంకన్న నూతనంగా ఎన్నికైన పాలక వర్గాల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను ప్రమాణ పత్రం తో ప్రతిజ్ఞ చేయించి ప్రమాణ స్వీకారం చేయించారు. వన్నారం, శంషాబాద్ గ్రామాల పంచాయతి సెక్రటరీలు ప్రసూన, కవిత ఆయా గ్రామాల ప్రజలు, పంచాయతి ఉద్యోగులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.