22-12-2025 11:31:21 PM
కోదాడ: గొర్రెలు మేకల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను త్రాగించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వ తేదీ వరకు ముందస్తు షెడ్యూలు ప్రకారం పశువైద్యాదికారులు,
సిబ్బంది టీములుగా ప్రతీ గ్రామాన్ని సందర్శించి ఉచిత నట్టల నివారణ శిభిరాలు ఏర్పాటు చేసి జీవాలకు నట్టల నివారణ మందులు తాగిస్తారని, గొర్రెలు మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను జిల్లా పశువైద్యశాలగా మార్చాలని శాసన సభ్యుల వారికి జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి విన్నవించగా తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.