22-12-2025 11:38:42 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సర్పంచుల ప్రమాణ స్వీకారం సందర్భంగా మండలంలోని ధర్మారెడ్డి,చిన్న ఆత్మకూర్, కన్నారెడ్డి గ్రామాల నూతన సర్పంచులను,ఉప సర్పంచులను,వార్డు మెంబర్లను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ మండల మాజీ జడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డిలు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కుముటు ఎక్కిపోతున్న గ్రామాలను గ్రామపంచాయతీలను అభివృద్ధి ధ్యేయంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
గత సర్పంచులు పోయినప్పటి నుండి ఇప్పటివరకు గ్రామాలు అన్ని మూలనపడి కుంటూ ఎక్కిపోయాయని వాటన్నిటిని మళ్లీ ఒక కొలిక్కి తెచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మీనారాయణ,సాయిలు, లక్ష్మీ లచ్చయ్య,ఉప సర్పంచ్ జయరాజ్,వార్డ్ మెంబర్లు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోతే శ్రీనివాస్,సాయిబాబ,గ్రామ కార్యదర్శి రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.