22-12-2025 10:28:48 PM
మాగనూరు: తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలల నుంచి ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో మాగనూరు మండలం మూడవ విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచినవారు సోమవారం ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీల వద్ద స్పెషల్ ఆఫీసర్ల ద్వారా మాగనూరు మండలంలో 16 గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు మాకు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించినందుకు గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, సమన్వయంగా మెలిగి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడు, శివరాంరెడ్డి, పర్మన్ దొడ్డి వెంకటరెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు వెంకటరెడ్డి, బిజెపి నాయకులు జయ నంద రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.