calender_icon.png 23 December, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ ఏసిపి, సీఐలతో సహా ఎస్ఐ లను సస్పెండ్ చేసిన డిజిపి

22-12-2025 11:40:57 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సీసీఎస్ ఇన్ స్పెక్టర్ గోపి, ఎస్సై విఠల్ ను సస్పెండ్ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.