21-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాంతి) : నిరాశ్రయులైన వృద్ధులకు ప్రభుత్వము ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 96 లక్షల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఇంతకుముందు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 8 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, బ్యాడ్మింటన్ కోడ్ ఇండోర్ క్రీడలు, రైఫిల్ రేంజ్, ఎంట్రెన్స్ ప్లాజా నిర్మాణం, ఇందిరా గాంధీ స్టేడియం కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం పార్కింగ్ ప్రాంతానికి ఇంటర్ లాకింగ్ పేపర్ బ్లాక్ లను అందించడం పచ్చదనాన్ని అందించడం వంటి రూ. 9.58 కోట్ల పనులతో రెడ్డి జిల్లా కేంద్రంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, బిటి రోడ్లు, కామారెడ్డి మార్కెట్ యార్డులో టాయిలెట్లు బ్లాక్ నిర్మాణం కాంపౌండ్ వాల్ దెబ్బతిన్న రాంప్ల నిర్మాణం కోసం 51 లక్షలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా రీడింగ్ రూమ్లో మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాల గాని పుస్తకాల పట్టణం వ్యక్తిత్వ వికాసానికి సామాజిక చైతన్యానికి ప్రజాస్వామ్య బలపరచడానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు పల్లెల్లో గ్రంధాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతి విద్యార్థి యువకుడు గ్రంథాలయాళంలో వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ లైబ్రరీలు ఈ లెర్నింగ్ సౌకర్యాలను మరింతగా విస్తరించి ఉన్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి సామూహికంగా భోజనాన్ని మంత్రి సీతక్క చేశారు. ఈ కార్యక్రమంలో జై రాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, ర్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
మలావత్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క..
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామాన్ని సందర్శించారు. పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణ గారి తండ్రి మాలవత్ దేవిదాస్ ఇటీవల మరణించటంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.మంత్రి సీతక్క , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపాతి రెడ్డి ఆమె వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలావత్ పూర్ణ ఇంటర్ పేద కుటుంబమని కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన కుటుంబమని ఆ కుటుంబంలో మలవత్పూర్ణ తండ్రి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది అన్నారు. మల్లావాత్ పూర్ణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండదండలుగా నిలుస్తుందని అని అన్నారు.
ఆర్కే కాలనీకి రోడ్డు వేయాలని మంత్రిని కోరిన కాలనీవాసులు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కేనగర్ కాలనీకి రోడ్డు వెయ్యాలని కాలనివాసులు గురువారం మంత్రి సీతక్కకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తాము కాలనీలో నివాసం ఉంటున్నామని వర్షాకాలం వస్తే ఆర్కేనగర్ రోడ్డు గుండా వెళ్లాలంటే బురదతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
మంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మున్సిపల్y కమిషనర్ రాజేందర్ రెడ్డి తక్షణమే ఈ రోడ్డును బాగు చేయించాలని ఆమె తెలిపారు. కాలనీ లో పార్క్ ఏర్పాటు చేయ్యాలన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 15 వార్డులోని ఆర్ కె నగర్ కాలనీలో మంత్రి సీతక్క పర్యటించడంతో తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసి రాధాకృష్ణ నగర్ కాలనీ వాసులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రమేష్, వెంకటి రెడ్డి,సిద్ది రాంరెడ్డి, మోసర్ల యాదగిరి, రాజా గౌడ్, ఎలక్ట్రీషియన్ రాములు, మేర రాములు తదితరులు పాల్గొన్నారు.
50 పడకల ఆసుపత్రిగా పనులు కొనసాగించాలని వినతి: మాజీ జడ్పీటీసీ తిరుమల గౌడ్
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా వెంటనే పనులను ప్రారంభించాలని కోరుతూ దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు, ఎంపీ సురేష్ హెడ్కర్ కు వినతి పత్రం అందజేసినట్లు మాజీ జెడ్పిటిసి తీగలు తిరుమల గౌడ్ తెలియజేశారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 తారీకు న 50 పడకల ఆసుపత్రిగా మార్చుటకు తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్స్ అనుమతి చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న ఆసుపత్రిలో 50 పడగల ఆసుపత్రిని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమకొండ లోని 10 పడకల ఆసుపత్రి నుండి 30 పడకల వరకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అభివృద్ధి పరచాడని.
ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రి సైతం షబ్బీర్ అలీ మంజూరు చేయించాడని తెలిపారు. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి పై భాగంలో అదనపు గదులు నిర్మించే పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 50 పడకల ఆసుపత్రికి సరిపడే సిబ్బందిని సైతం భర్తీ చేయాలని మంత్రి సీతక్కకు, ఎంపీ సురేష్ హెడ్కర్ కు, షబ్బీర్ అలీకి వినతి పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి,పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు,శంకర్ రెడ్డి నయీమ్, నాయకులు తదితరులున్నారు.