calender_icon.png 21 November, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి పంటకు నిప్పంటించిన రైతు

21-11-2025 12:00:00 AM

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన 

నాగర్‌కర్నూల్, నవంబర్ 20 (విజయక్రాంతి): పండించిన పంట తీసేందుకు కూ లీల కొరత, గిట్టుబాటు ధర లేక పత్తిపంటకు రైతు నిప్పు పెట్టాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండ లం ఆవంచ గ్రామానికి చెందిన రైతు సుదర్శన్‌రెడ్డి 9 ఎకరాల్లో పత్తి  సాగు చేశాడు. ఎకరాల్లో 15 క్వింటాళ్ల పత్తి పంటను కూలీలతో తీసి, సీసీఐ కేంద్రానికి తీసుకెళ్లాడు. తేమ, ఎకరాకు౭ క్వింటాళ్లు మాత్రమే అమ్ముకోవాలని నిబంధన విధించడంతో అక్కడే ఉన్న ఓ దళారికి రూ.80 వేలకే అమ్ముకున్నాడు. కూలీలకే రూ.1.40లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. మిగతా ౩ ఎకరాల పత్తి తీతకు కూలీలు దొరకకపోవడంతో మనస్థాపం చెంది నిప్పు పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.